manchu manoj: కళ్లు తిప్పకుండా అలాగే చూస్తుండిపోవాలనిపిస్తోంది: ఎన్టీఆర్ పోస్టర్ పై మంచు మనోజ్

  • ఎన్టీఆర్ పోస్టర్ పై మనోజ్ ప్రశంసలు
  • నభూతో నభవిష్యత్ అంటూ అభినందనలు
  • నీలో చాలా శక్తి దాగి ఉంది అంటూ క్రిష్ కు ప్రశంస

బాలకృష్ణ, క్రిష్ ల కాంబినేషన్లో నందమూరి తారకరామారావు బయోపిక్ 'ఎన్టీఆర్' శరవేగంతో తెరకెక్కుతోంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ పోస్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మంచు మనోజ్ కూడా ఈ పోస్టర్ పై అభినందనలు కురిపించాడు. 'నభూతో నభవిష్యత్. కళ్లు తిప్పకుండా అలాగే చూస్తుండిపోవాలనిపిస్తోంది. ఇంత అద్భుతమైన పోస్టర్ ను వదిలిన నా డార్లింగ్ బ్రదర్ క్రిష్ కు ధన్యవాదాలు. నీలో చాలా శక్తి దాగి ఉంది' అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.

manchu manoj
krish
ntr
poster
  • Loading...

More Telugu News