kanna lakshminarayana: పురందేశ్వరి, కన్నా ఇద్దరూ రాష్ట్ర ద్రోహులు: కేశినేని

  • బీజేపీలో చేరి రాష్ట్రానికి కన్నా అన్యాయం చేశారు
  • బీజేపీని ప్రజలు తరిమి కొడతారు
  • చంద్రబాబు ఇమేజ్ వల్లే అమరావతి బాండ్స్ గంటలోనే అమ్ముడుపోయాయి

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, పురందేశ్వరిలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. వీరిద్దరూ రాష్ట్రానికి ద్రోహులుగా తయారయ్యారని విమర్శించారు. విజయవాడలో తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరి రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి కన్నా అని కేశినేని అన్నారు. బీజేపీని తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అమరావతి బాండ్స్ గంటలోనే అమ్ముడుపోయాయంటే... అది చంద్రబాబు ఇమేజ్ వల్లే సాధ్యమయిందని అన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని చెప్పారు.

kanna lakshminarayana
Kesineni Nani
purandeshwari
  • Loading...

More Telugu News