Arvind Kejriwal: ఈ జన్మలో మిమ్మల్ని వదులుకోలేం అశుతోష్ జీ.. కేజ్రీవాల్ భావోద్వేగ ట్వీట్!

  • రాజీనామాను ఈ జన్మలో ఆమోదించబోమన్న ఢిల్లీ సీఎం
  • ఆయనతో మాట్లాడుతామన్న ఆప్ నేతలు
  • ఈ రోజు పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత అశుతోష్

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి సీనియర్ నేత అశుతోష్ రాజీనామా సమర్పించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. అశుతోష్ రాజీనామాను ఈ జన్మలో అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రతి ప్రయాణానికి ముగింపు ఉంటుందని, ఆప్ లో తన ప్రయాణం ముగిసిందని అశుతోష్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై కేజ్రీవాల్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘సార్ మేమంతా మిమ్మల్ని ఎంతగానో  ప్రేమిస్తున్నాం. మీ రాజీనామాను ఎప్పుడైనా ఎలా అంగీకరిస్తాం? దాన్ని ఆమోదించడం ఈ జన్మలో జరగదు’ అని భావోద్వేగంతో ట్వీట్ చేశారు.


కాగా, అశుతోష్ రాజీనామా బాధాకరమైన విషయమని మరో నేత గోపాల్ రాయ్ అన్నారు. రాజీనామా వెనక్కి తీసుకునేలా ఆయనతో చర్చిస్తామని వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆప్ కు రాజీనామా చేస్తున్నట్లు అశుతోష్ ఈ రోజు ఉదయం పేర్కొన్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగా టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Arvind Kejriwal
delhi
asutosh
resign
Twitter
tweet
  • Loading...

More Telugu News