banjara hills: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు

  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • యువకుడి పరిస్థితి విషమం
  • బంధువులు అక్రమ కేసు పెట్టారంటూ ఆత్మహ్యతాయత్నం

హైదరాబాదులోని బంజారాహిల్స్ లో కలకలం రేగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసులు హుటాహుటిన బయటకు వచ్చి, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బంధువులు తనపై అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నారన్న ఆవేదనతోనే బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

banjara hills
police station
suicide attempt
  • Loading...

More Telugu News