salman khan: సల్మాన్ ఖాన్ ‘భారత్’ టీజర్ విడుదల..ఆకట్టుకుంటున్న డైలాగ్!

  • 1940ల్లో ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న భారత్
  • వచ్చే ఏడాది రంజాన్ కు విడుదల
  • మాల్టాలో శరవేగంగా సాగుతున్న షూటింగ్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా టీజర్ ను ఈ రోజు విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాను మాల్టాలో షూట్ చేస్తున్నారు. 1940ల్లో భారతదేశం, విభజన సందర్భంగా ఎదురైన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సల్మాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘‘కొన్ని బంధాలు నేలతో ఏర్పడతాయి. మరికొన్ని బంధాలు రక్తంతో ఏర్పడతాయి’ అని నాన్నగారు చెప్పేవారు. కానీ నా దగ్గర రెండు రకాల బంధాలు ఉన్నాయి’’ అని సల్మాన్ వాయిస్ఓవర్ తో టీజర్ అద్భుతంగా ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి కొద్దిరోజుల క్రితం ప్రియాంక చోప్రా తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా భారత్ తో సల్మాన్ తో పాటు కత్రినా కైఫ్, దిశా పటానీ, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రంజాన్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు అబ్బాస్ అనుకుంటున్నారు. విశాల్-శేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాను రీల్ లైఫ్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

salman khan
bharat
EID 2019
tabu
katrina
teaser
  • Error fetching data: Network response was not ok

More Telugu News