Chiranjeevi: బ‌ర్త్ డే కి ఒకరోజు ముందుగానే అభిమానులకి సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న మెగాస్టార్!

  • ఈనెల 21న ఉద‌యం గం.11.30 లకు టీజ‌ర్ 
  • హైదరాబాద్ శివారులో షూటింగ్
  • సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో సైరా

చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైరా సినిమా నుండి టీజర్ రాబోతోంది. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ ని చిరు బ‌ర్త్ డే కి ఒకరోజు ముందుగానే ఈనెల 21న ఉద‌యం గం.11.30 లకు విడుదల చేయనున్నట్లు కాసేపటి క్రితం చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులో జరుగుతోంది. కాగా, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

  • Loading...

More Telugu News