Chandrababu: మా వల్లే ఒక్కరోజులో అమరావతికి రూ.2,000 కోట్లు వచ్చాయి!: చంద్రబాబు

  • కేంద్రం సాయం లేకున్నా ముందుకు వెళుతున్నాం
  • ప్రభుత్వంపై నమ్మకంతోనే రూ.2,000 కోట్ల బాండ్లు అమ్మకం
  • అమరావతి రెడీ అయితే లాభం కేంద్రానికే

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం జారీచేసిన బాండ్లకు అనూహ్య స్పందన వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. బాండ్లను బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ లో లిస్ట్ చేయగానే ఒక్క రోజులోనే అమ్ముడుపోయాయని వెల్లడించారు. దీనిద్వారా రాష్ట్రానికి రూ.2,000 కోట్ల మేర నగదు సమకూరిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, అమరావతి ప్రాజెక్టుపై ఉన్న విశ్వాసం కారణంగానే ఇది సాధ్యమైందని బాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం మాట్లాడారు.

అమరావతి నిర్మాణానికి సహాయం చేస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు.  ఏదేమైనా రాష్ట్ర  అభివృద్ధి విషయంలో వెనక్కు తగ్గబోనని బాబు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణమైతే కేంద్రానికే లాభమనీ, దానివల్ల పన్నులు, ఇతర ఆదాయం కేంద్రానికే వెళతాయని సీఎం అన్నారు. అయినా కేంద్రం రాజధాని నిర్మాణం విషయంలో సహాయ నిరాకరణ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu
Andhra Pradesh
independence day
amaravati
Rs.2000 crores
  • Loading...

More Telugu News