Andhra Pradesh: మళ్లీ ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నేడు, రేపటిలోగా వాయుగుండం!
- నేడు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
- అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- 18న అల్పపీడనం
గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. వర్షాలు ఇంకా పడుతుండగానే వాతావరణ శాఖ మరో వార్త చెప్పింది. నేడు (బుధవారం), రేపటి(గురువారం) లోగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. మరోవైపు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ను అనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేడు కోస్తా జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.