kcr: గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన కేసీఆర్

- పరేడ్ మైదానంలో సైనికుల స్మారకం వద్ద నివాళి అర్పించిన కేసీఆర్
- అక్కడ నుంచి నేరుగా గోల్కొండ కోటకు పయనం
- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు ఆయన పరేడ్ మైదానంలో ఉన్న సైనికుల స్మారకం వద్ద ఘన నివాళి అర్పించారు.


