Tollywood: ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ వీడియో లీకేజీ నిందితుడి గుర్తింపు.. పోలీసుల వేట!

  • ఇటీవల లీకైన 'అరవింద సమేత' వీడియో
  • డేటాను కాపీ చేసి షేర్ చేసిన యువకుడు
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరవింద సమేత’ సినిమాకు సంబంధించిన మూడు నిమిషాల వీడియో క్లిప్ ఇటీవల లీక్ అయింది. ఈ లీకేజీ వెనక ఉన్న నిందితులను పోలీసులు గుర్తించారు. సినిమా రోజువారీ చిత్రీకరణకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను హార్డ్ డిస్క్‌లో భద్ర పరుస్తారు. సినిమాను ఎడిటింగ్ చేసి మెరుగులు దిద్దే సమయంలో ఈ డేటాను అవసరం మేరకు వినియోగిస్తారు. ఈ డేటాను భద్రపరిచే బాధ్యతను నిర్మాణ సంస్థ ఫిలింనగర్‌లోని ఓ డేటా డిజిటల్ బ్యాంకుకు అప్పగించింది. అందులో పనిచేసే సిబ్బందే ఈ వీడియో క్లిప్‌ను లీక్ చేసినట్టు తెలిసింది.

‘అరవింద సమేత’కు సంబంధించిన వీడియో క్లిప్  యూట్యూబ్ సహా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన నిర్మాణ సంస్థ  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు డేటాను భద్రపరిచే విభాగంలో పనిచేస్తున్న చక్రవర్తి అనే యువకుడు వీడియోను కాపీ చేసి స్నేహితులకు షేర్ చేసినట్టు గుర్తించారు.  ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tollywood
NTR
Aravinda sametha
Viral Videos
Leake
  • Loading...

More Telugu News