Narendra Modi: ఏపీ, తెలంగాణ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు: ఎర్రకోటపై నుంచి మోదీ

  • ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని
  • నీలగిరి పుష్పంలా దేశం వికసిస్తోందన్న మోదీ
  • మన బాలికలు అద్భుతం చేశారని ప్రశంస

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దేశప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు.

నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందన్నారు. సాహసాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం  శ్రమిస్తోందన్నారు. 12 ఏళ్లకు ఓసారి పుష్పించే నీలగిరి పూలలా దేశం వికసిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రశంసించారు. మన బాలికలు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆత్మవిశ్వాసాన్ని నలుదిశలా చాటారన్నారు.

ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాలు ఫలప్రదమయ్యాయన్న మోదీ.. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. దేశం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు.

Narendra Modi
Independence day
Andhra Pradesh
Telangana
Girls
Redfort
  • Loading...

More Telugu News