Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పారితోషికం గురించి ఆలోచించనంటున్న కీర్తి
  • భోజ్ పురి సినిమాలో జగపతిబాబు?
  • సిల్క్ స్మిత జీవితంపై వెబ్ సీరీస్

*  'సినిమా గురించే ఆలోచిస్తాను తప్ప పారితోషికం గురించి మాత్రం అస్సలు ఆలోచించనని అంటోంది అందాలభామ కీర్తి సురేశ్. 'చిన్నప్పటి నుంచీ సినిమా రంగంపై ఉన్న నా కలల్ని నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అంతేతప్ప, ఏవో కోట్లు సంపాదించాలని కాదు. అందుకే కథకు, నా పాత్రకే ప్రాధాన్యతనిస్తాను. మనం సక్సెస్ అయితే పారితోషికం దానంతట అదే పెరుగుతుంది' అని చెప్పింది.
*  సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న తరహా పాత్రలు పోషిస్తున్న జగపతిబాబు, ఇప్పుడు భోజ్ పురి చిత్రంలో కూడా నటించడానికి రెడీ అవుతున్నాడు. ఆ భాషకు చెందిన ఓ నిర్మాత ఇటీవల జగపతిని కలసి కథ చెప్పగా వెంటనే ఆయన అంగీకరించాడట.  
*  శృంగారతారగా ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన సిల్క్ స్మిత బయోపిక్ గా కొన్నాళ్ల క్రితం 'డర్టీ పిక్చర్' పేరిట ఓ సినిమా వచ్చిన సంగతి విదితమే. ఇప్పుడు మళ్లీ స్మిత జీవితంపై ఓ వెబ్ సీరీస్ ను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'కబాలి', 'కాల' చిత్రాల దర్శకుడు పా రంజిత్ దీనిని నిర్మిస్తాడు.

Keerthi Suresh
Jagapatibabu
silk Smitha
Ranjith
  • Loading...

More Telugu News