chhattishgarh: చత్తీస్ గఢ్ గవర్నర్ బలరామ్ దాస్ టాండన్ కన్నుమూత

  • బలరామ్ దాస్ టాండన్ వయసు 90 ఏళ్లు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం రమణ్ సింగ్

చత్తీస్ గఢ్ గవర్నర్ బలరామ్ దాస్ టాండన్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనను ఈరోజు రాయపూర్ ఆసుపత్రిలో చేర్చారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 ఏళ్లు. టాండన్ మృతి పట్ల చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన తండ్రిలాంటి వారని చెప్పారు. చత్తీస్ గఢ్ ప్రజల హృదయాల్లో ఆయన కలకాలం నిలిచిపోతారని అన్నారు. 

chhattishgarh
governor
balramji das tandon
passes
raman singh
  • Loading...

More Telugu News