sahoo: చిన్నారి కోరికను తీర్చిన ‘బాహుబలి’.. ఆనందంలో మునిగిపోయిన బాలుడు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-eec977830eeb864baad1c67d8c330d9d5b1d91e8.jpg)
- బాలుడిని కలుసుకున్న యంగ్ రెబెల్ స్టార్
- అనంతరం ఫొటోలు దిగిన ప్రభాస్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోలు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఎక్కడున్నా అక్కడ సందడి నెలకొంటుంది. సినిమా సెట్ లో హుషారుగా ఉండే ప్రభాస్ ఫ్యాన్స్ ను కలుసుకోవడానికి ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా మదన్ రెడ్డి అనే చిన్నారి ప్రభాస్ ను కలవాలని ఉందని ఫొటో పోస్ట్ చేయగా.. వెంటనే స్పందించిన ప్రభాస్ అతనితో కలసి ఫొటో దిగాడు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
![](https://img.ap7am.com/froala-uploads/froala-eb5ec48584669be703539476e6cf3f9da7615ce1.jpg)
మదన్ రెడ్డి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ‘నాకు బాహుబలి (ప్రభాస్)ని కలవాలని ఉంది’ అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని తల్లిదండ్రులతో కలసి ఫొటో దిగాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన ప్రభాస్ వెంటనే స్పందించాడు. సదరు బాలుడి వివరాలు తెలుసుకుని అతడిని కలుసుకున్నాడు. తన అభిమాన హీరో తన ముందుకే రావడంతో పిల్లాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మదన్ తో కొద్దిసేపు సరదాగా గడిపిన ప్రభాస్ అతనితో ఫొటో కూడా దిగాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
![](https://img.ap7am.com/froala-uploads/froala-668ba9cdb988d346f7606b3ddbfd5424320b3144.jpg)