amala paul: షూటింగ్ లో గాయపడి.. కేరళలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న అమలాపాల్

  • యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుండగా గాయం
  • మణికట్టు లిగమెంట్ చిట్లింది 
  • ఆసుపత్రిలో ఉన్న ఫొటోను షేర్ చేసిన అమలాపాల్

హీరోయిన్ అమలాపాల్ గాయపడింది. 'అదో అంద పరవాయ్ పోల' సినిమా షూటింగ్ లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశంలో నటిస్తుండగా ఆమె గాయపడింది. ట్రీట్ మెంట్ కోసం ఆమె కేరళ వెళ్లింది. సినిమా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుండగా ఆమె మణికట్టు ట్విస్ట్ అయింది. దీంతో ఆ ప్రాంతంలో ఉండే లిగమెంట్ చిట్లింది.

 అయితే, ఇది చిన్న గాయమే అని భావించిన అమలాపాల్... షూటింగ్ ను కొనసాగించింది. అయితే, నొప్పి అంతకంతకూ తీవ్రతరం కావడంతో చిత్ర బృందం ఆమెను ఆసుపత్రికి తరలించింది. కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమెకు సూచించారు. చేతికి కట్టు కట్టుకుని ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. 

amala paul
actress
tollywood
kollywood
wound
  • Loading...

More Telugu News