Xiaomi Pocophone F1: ఆకట్టుకునే ఫీచర్లతో షియోమీ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది!
- పోకో ఎఫ్1 పేరిట కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్
- ఈనెల 22న భారత మార్కెట్లోకి
- ట్వీట్ చేసిన 'పోకో ఇండియా'
షియోమీ అనుబంధ సంస్థ పోకో నుండి నూతన స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఈనెల 22న 'పోకో ఎఫ్1' పేరిట కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు 'పోకో ఇండియా' తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. పలు ఆకట్టుకునే ఫీచర్ లు ఉన్న ఈ ఫోన్ అత్యుత్తమమైన ప్రదర్శనను ఇస్తుందని పేర్కొంది.
షియోమీ పోకో ఎఫ్1 ప్రత్యేకతలు:
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
- 5.99" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
- 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- వెనక భాగంలో 12/5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు
- ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్
- 4000ఎంఏహెచ్ బ్యాటరీ (క్విక్ చార్జ్ 3.0)