Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ‘జనసేన’ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విడుదల

  • భీమవరంలో అమ్మవారిని సందర్శించిన పవన్
  • అనంతరం విజన్ డాక్యుమెంట్ విడుదల
  • మేనిఫెస్టోలో 12 హామీలు, 7 సిద్ధాంతాలు

జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మ వారిని పవన్ ఈ రోజు దర్శించుకున్నారు. అనంతరం విజన్ డాక్యుమెంట్ ను ఆయన విడుదల చేశారు. ఈ మేరకు ‘జనసేన’ ట్విట్టర్ లో ఈ విజన్ డాక్యుమెంట్ ను పొందుపరిచారు. మేనిఫెస్టోలోని కొన్ని మచ్చుతునకలంటూ 12 హామీలతో పాటు 7 సిద్ధాంతాలను పొందుపర్చారు.

హామీలు..

- మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు
- గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
- రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో రూ.2,500 రూ.3,500/ వరకు నగదు
- బీసీలకు అవకాశాన్ని బట్టి 5 % రిజర్వేషన్లు పెంపుదల
- చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
- కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
- ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
- ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్
- ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతి గృహాలు
- ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు
- ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు
- వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు

సిద్ధాంతాలు..

- కులాలను కలిపే ఆలోచనా విధానం
- మతాల ప్రస్తావన లేని రాజకీయం
- భాషలను గౌరవించే సంప్రదాయం
- సంస్కృతులను కాపాడే సమాజం
- ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం
-  అవినీతిపై రాజీలేని పోరాటం
- పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం

  • Loading...

More Telugu News