HACKING: పూణేలో బ్యాంక్ సర్వర్ హ్యాక్.. రూ. 94.5 కోట్లు కొల్లగొట్టిన వైనం!

  • పూణేలోని కాస్మోస్ బ్యాంక్ కు కుచ్చుటోపి
  • నగదు భారత్, హాంగ్ కాంగ్ లోని అకౌంట్లకు మళ్లింపు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

మహారాష్ట్రలో హ్యాకర్లు రెచ్చిపోయారు. పూణేలోని కాస్మోస్ బ్యాంకు ప్రధాన కార్యాలయం సర్వర్ ను హ్యాక్ చేసిన నిందితులు ఏకంగా రూ.94.5 కోట్లు కొల్లగొట్టారు. ఈ మొత్తాన్ని భారత్ తో పాటు హాంగ్ కాంగ్ లోని పలు అకౌంట్లకు మళ్లించారు. హ్యాకర్లు తొలుత ఈ నెల 11న బ్యాంకుపై పంజా విసిరారు. తొలి సైబర్ దాడిలో బ్యాంకు సర్వర్ ను హ్యాక్ చేసిన నిందితులు.. రూ.78 కోట్లు స్వాహా చేశారు. అనంతరం నిన్న జరిపిన మరో దాడిలో రూ.14 కోట్లు నొక్కేశారు.

అంతేకాకుండా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) నుంచి భారత్ లోని ఓ అకౌంట్ లోకి మరో రూ.2.5 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇలా రూ.94.5 కోట్ల నగదును నిందితులు బ్యాంక్ నుంచి కొట్టేశారు. కాగా, ఈ ఘటనలో ఏఎల్ఎమ్ ట్రేడింగ్ లిమిటెడ్ తో పాటు గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News