Rahul Gandhi: జానారెడ్డికి అవమానం... అడ్డుకున్న రాహుల్ సిబ్బంది, గమనించి అప్రమత్తమైన ఉత్తమ్!

  • రాహుల్ కలిసే నేతల జాబితాలో కనిపించని జానారెడ్డి పేరు
  • జానారెడ్డిని అడ్డుకున్న రాహుల్ ఎస్పీజీ సెక్యూరిటీ
  • పరిస్థితి గమనించి జానారెడ్డిని బుజ్జగించిన ఉత్తమ్

ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో రాహుల్ గాంధీ సమావేశమైన వేళ, కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత కుందూరు జానారెడ్డికి అవమానం జరిగింది. రాహుల్ గాంధీని కలిసేవాళ్లలో జానారెడ్డి పేరు లేదని చెబుతూ, రాహుల్ గాంధీ ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆయన్ను పక్కకు జరగాలంటూ ఆదేశించడంతో, అవమాన భారంతో అలకబూనిన ఆయన అక్కడి నుంచి వెళ్లిపోబోయారు. పక్కనే ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అప్రమత్తమై ఎస్పీజీ సిబ్బందిని వారించారు. జానారెడ్డి వద్దకు వచ్చి, ఆయన్ను బుజ్జగించి సమావేశానికి రాకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని నచ్చజెప్పి, లోనికి తీసుకెళ్లారు.

Rahul Gandhi
Hyderabad
Jana Reddy
Uttam Kumar Reddy
SPG
  • Loading...

More Telugu News