Cricket: భారత క్రికెటర్లకు తీవ్ర అవమానం.. చిన్న పిల్లలంటూ ఎగతాళి చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్!

  • భారత జట్టు స్థాయికి తగ్గట్లు ఆడలేదు
  • టెస్ట్ మ్యాచ్ మెన్స్ వర్సెస్ బాయ్స్ లా సాగింది
  • ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ విమర్శలు

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన భారత క్రికెట్ జట్టుపై విమర్శలు ఆగడం లేదు. కొందరైతే ఓపెనర్ మురళీ విజయ్ ను తప్పించి స్మృతి మంధనను జట్టులోకి తీసుకోవాలని, ఇంగ్లండ్ లో జరుగుతున్న లీగ్ లో ఆమె అదరగొడుతోందని సెటైర్లు కూడా వేశారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ భారత జట్టు ఆటతీరుపై విమర్ళలు గుప్పించాడు.

ఇంగ్లండ్-భారత్ ల మధ్య లార్డ్స్ టెస్టు మెన్ వర్సెస్ బాయ్స్ లా సాగిందని ఎద్దేవా చేశాడు. పెద్దవాళ్లతో చిన్నపిల్లలు పోటీపడినట్లు భారత జట్టు ఆట సాగిందని అవమానించాడు. భారత ఆటగాళ్లు కనీస పోరాట పటిమను చూపలేకపోయారని విమర్శించాడు. ప్రపంచ నంబర్ 1 జట్టయిన భారత్ ఇంగ్లండ్ లో ఆశాజనక ప్రదర్శన చేస్తుందని అందరూ ఆశించారని వ్యాఖ్యానించాడు. సీమ్ పిచ్ లపై ఇంగ్లండ్ మరోసారి అద్భుతంగా రాణించిందని హుస్సేన్ కితాబిచ్చాడు. 2016 భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు 4-0తో ఓడిపోయిందనీ, ఇప్పుడు సిరీస్ ను 5-0తో వైట్ వాష్ చేసి లెక్క సరిచేస్తామని అన్నాడు.

లార్డ్స్ లో జరిగిన రెండో టెస్ట్ లో భారత జట్టు 159 పరుగులతో చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లండ్ 2-0 అధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో ఈ నెల 18 నుంచి మూడో టెస్ట్ మొదలుకానుంది.

Cricket
india
england
test series
lords
nasir hussain
team india
mens vs boys
  • Loading...

More Telugu News