New Delhi: ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేయడానికి దొంగగా మారిన తల్లి!

  • న్యూఢిల్లీకి వలస వచ్చిన మోతియా
  • కుమార్తెల పెళ్లి కోసం దొంగతనాలు
  • 24 దొంగతనాల తరువాత దొరికిపోయిన మోతియా

పెళ్లికాని కుమార్తెలను ఏదో ఒకలా ఓ అయ్య చేతిలో పెట్టాలన్న తాపత్రయంతో ఓ తల్లి చేసిన పనులు ఆమెను కటకటాల వెనక్కు నెట్టాయి. న్యూఢిల్లీ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రాజస్థాన్, అజ్మీర్ కు చెందిన 35 ఏళ్ల మహిళ మోతియాకు ముగ్గురు కుమార్తెలు. వారి పోషణ నిమిత్తం ఢిల్లీకి వలస వచ్చిన ఆమె, ఉద్యోగం దొరక్క చాలా అవస్థలు పడింది. కుమార్తెలు పెళ్లీడుకు ఎదగడంతో, వారికి వివాహాలు చేసేందుకు అవసరమయ్యే డబ్బు కోసం అడ్డదార్లు తొక్కింది.

ధనవంతుల ఇళ్లను ఎంచుకుని, ఎవరూ లేని సమయంలో వాటి తలుపులు లేదా కిటికీలు పగులగొట్టి, లోపలికి దూరి దొంగతనాలు చేసేది. దాదాపు 24 దొంగతనాలు చేసింది. తన ఇంట్లో రూ. 50 వేలు పోయాయని ఆనంద్ నికేతన్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, మోతియాను గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

New Delhi
Police
Theft
Arrest
Daughters
Marriage
  • Loading...

More Telugu News