Anushka Sharma: నాపై పథకం ప్రకారమే దాడి చేస్తున్నారు: అనుష్క శర్మ

  • టీమిండియా ఆటగాళ్లకు భారత హైకమిషన్ ఇచ్చిన విందుకు హాజరైన అనుష్క
  • వెల్లువెత్తుతున్న విమర్శలు
  • లార్డ్స్ టెస్టులో ఓటమి అనంతరం మరింత పెరిగిన దాడి

ఇంగ్లండ్ లో జరిగిన రెండో టెస్టుకు (లార్డ్ టెస్టు) ముందు టీమిండియా ఆటగాళ్లు, జట్టు మేనేజ్ మెంట్ సిబ్బందికి లండన్ లోని భారత్ హైకమిషన్ కార్యాలయం విందు కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క శర్మ కూడా హాజరుకావడం విమర్శలకు దారి తీసింది. ఈ అంశంపై ఇప్పటికే భారత హైకమిషన్, బీసీసీఐ వివరణ ఇచ్చినప్పటికీ విమర్శలు ఆగలేదు. దీంతోపాటు లార్డ్స్ టెస్టులో భారత్ ఘోరంగా ఓటమిపాలు కావడంతో విమర్శలు మరింత పెరిగాయి.

ఈ నేపథ్యంలో అనుష్క శర్మ స్పందించింది. ఆ రోజు నిబంధనలకు అనుగుణంగానే విందు కార్యక్రమం జరిగిందని ఆమె తెలిపింది. ఆ కార్యక్రమంలో తాను ఎందుకు పాల్గొన్నాననే విషయాన్ని కూడా అధికారులు వివరించారని... అయినా తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని మండిపడింది. ఇదంతా ఒక పథకం ప్రకారమే తనపై జరుగుతున్న దాడి అని తెలిపింది. ఇలాంటి విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పింది. 

Anushka Sharma
Virat Kohli
  • Loading...

More Telugu News