Rajamahendravaram: ఉగ్ర గోదావరి... ధవళేశ్వరం ఆనకట్ట 175 గేట్లూ ఎత్తివేత!
- ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు
- 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు
- సాయంత్రానికి మరింతగా పెరగనున్న వరద
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది మరింత ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలసిపోతోంది. ధవళేశ్వరానికి భారీ ఎత్తున వరద వస్తుండటంతో బ్యారేజ్ కి ఉన్న 175 గేట్లనూ అధికారులు ఎత్తివేశారు. ధవళేశ్వరం నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. నీటి మట్టం 8.6 అడుగులుగా నమోదైంది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సాయంత్రానికి మరింత వరద నీరు రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద ఈ ఉదయం 10 గంటల సమయంలో గోదావరి 38.3 అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది.