Vijayawada: జలదృశ్యం అద్భుతం... ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లూ ఎత్తివేత!

  • ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు
  • నిండుకుండలా మారిన జలాశయం
  • 70 గేట్ల ఎత్తివేతతో సుందర దృశ్యం

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా మారగా, గడచిన కొన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా బ్యారేజ్ 70 గేట్లనూ ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

 దీంతో కృష్ణమ్మ పరవళ్లు విద్యుద్దీప కాంతుల మధ్య అద్భుత జలదృశ్యాన్ని సాక్షాత్కరింపజేస్తుండగా, దాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. కృష్ణా నదీ తీరం ఒక్కసారిగా నీటితో నిండిపోగా, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అవసరమైతే ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. 

Vijayawada
Prakasam Barraze
Night
Krishna River
Flood
Rains
  • Loading...

More Telugu News