kcr: నిరుద్యోగులకు భృతి ఇవ్వడం సాధ్యం కాదు: సీఎం కేసీఆర్
- ఎవరు నిరుద్యోగులు? ఎంతమంది ఉన్నారు?
- ఆ విషయాలను ఎలా నిర్ణయిస్తారు?
- ఎడాపెడా హామీ లిచ్చి మోసం చేయడం కరెక్టు కాదు
నిరుద్యోగులకు భృతి ఇవ్వడమనేది సాధ్యం కాదని, ఎవరు నిరుద్యోగులు? ఎంతమంది ఉన్నారు? అనే విషయాలను ఎలా నిర్ణయిస్తారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం, ప్రగతిభవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఎడాపెడా హామీ లిచ్చి మోసం చేయడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలోనూ డ్వాక్రా రుణాల మాఫీ కోసం ఒత్తిడి చేస్తే తాను ఒప్పుకోలేదని అన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటి కోసం ఏపీ ఎంపీల కంటే, ఎక్కువే పోరాడామని, బీహార్ సీఎం నితీశ్ కుమార్ అడిగినందువల్లే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చామని, నితీశ్ కుమార్ తనకు మంచి మిత్రుడని, ఆయన మాత్రమే తమ మద్దతు అడిగిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.