Tirupati: తిరుపతిలో అప్రకటిత బంద్ వాతావరణం!

  • మహాసంప్రోక్షణం నేపథ్యంలో భారీగా తగ్గిన భక్తులు
  • 20 వేలు కూడా దాటని భక్తుల సంఖ్య
  • వెలవెలబోతున్న తిరుపతి

తిరుమల శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ నేపథ్యంలో తిరుపతి బోసి పోయింది. మహాసంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామంటూ టీటీడీ ప్రకటించినా... భక్తులు తిరుమల రావడానికి ఆసక్తి చూపడం లేదు. తిరుమల వచ్చేవారి సంఖ్య 20 వేలు కూడా దాటడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రోడ్లు, హోటళ్లు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్టాండు సమీపంలోని హోటళ్లు తమ సిబ్బందికి వారం పాటు సెలవులు కూడా ఇచ్చాయి. బస్టాండు, రైల్వే స్టేషన్ వెలవెలపోతున్నాయి. ఇక అలిపిరి వద్ద అయితే, జనసందోహమే కనిపించడం లేదు. శ్రీనివాసం, మాధవం వద్ద భక్తుల సందడే లేదు. తిరుమల-తిరుపతి మధ్య నిన్న 600 ట్రిప్పులు రద్దు చేసినట్టు తిరుమల డిపో ఇన్ ఛార్జి తెలిపారు. ఈరోజ కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News