gautham: నాన్న చెప్పిన మాటను ఎప్పటికీ మరచిపోను: బ్రహ్మానందం తనయుడు

  • ఫణీంద్ర వచ్చి కథ వినిపించాడు 
  • నాతోనే చేస్తానని పట్టుబట్టాడు 
  • నా కెరియర్లో నిలిచిపోయే మూవీ అవుతుంది   

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ తెలుగు చిత్రపరిశ్రమకి కథానాయకుడిగా పరిచయమై చాలా కాలమైంది. అయితే ఆశించిన స్థాయిలో ఆ సినిమాలు ఆడకపోవడం వలన, ఆయనకి అంతగా గుర్తింపు రాలేదు. అయినా పట్టువదలకుండా ఆయన 'మను' అనే సినిమా చేశాడు. ఫణీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ .. "వైవిధ్య భరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఫణీంద్ర ఈ సినిమా కథను నాకు చెప్పినప్పుడు .. నేనే చేయాలని అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో చేయడమే అదృష్టంగా భావించాను. ఏ పని చేసినా అంకితభావంతో రక్త మాంసాలు ధారపోయాలని నాన్న నాకు చెప్పాడు. ఈ ప్రాజెక్టు విషయంలో ఆ మాటకి నేను పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఆయన చెప్పిన ఈ మాటను నేను ఎప్పటికీ మరచిపోను. ఈ సినిమా నాకు తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది .. నా కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుంది" అని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News