jc diwakar reddy: పెదనాన్న, నాన్నల కలలను నెరవేర్చడమే నా లక్ష్యం: జేసీ అస్మిత్ రెడ్డి

  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దిశగా జేపీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు
  • ప్రజలకు అందుబాటులో ఉంటానన్న అస్మిత్ రెడ్డి
  • పెదనాన్న, నాన్నల ఆశయమైన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకొచ్చేందుకు యత్నిస్తా

జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తన స్థానంలో కుమారుడిని ఎన్నికల బరిలో నిలిపేందుకు దివాకర్ రెడ్డి పథక రచన చేస్తున్నారు. తాజాగా ఆయన తమ్ముడు, తాడపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు. తాడిపత్రి నుంచి తన కుమారుడు జేసీ అశ్మిత్ రెడ్డి బరిలోకి దిగుతాడని ప్రకటించారు. తాను కౌన్సిలర్ గా పోటీ చేస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలో అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ, పెదనాన్న, నాన్నల కలలను నెరవేర్చడమే తన ఆశయమని చెప్పారు. తాడిపత్రిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనేది వారి ఆశయమని, వారి ఆకాంక్షలను తాను నెరవేరుస్తానని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం, విద్యను అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు సత్వరం పరిష్కారమయ్యేలా పని చేస్తానని తెలిపారు.

jc diwakar reddy
jc pavan reddy
jc prabhakar reddy
jc asmith reddy
  • Loading...

More Telugu News