Nara Lokesh: మనమంతా చివరకు వెళ్లేది శ్మశానానికే!: నారా లోకేష్
- కోరిటెపాడులో వైకుంఠధామాన్ని ప్రారంభించిన లోకేష్
- 2020 నాటికి శ్మశానవాటికలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్న మంత్రి
- శ్మశానాలంటే దెయ్యాలు, భూతాలు కాదన్న స్పీకర్
గుంటూరు జిల్లా కోరిటెపాడులో వైకుంఠధామాన్ని ఈరోజు మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2020 నాటికి రాష్ట్రంలో శ్మశానవాటికలు అన్నింటినీ అభివృద్ధి చేస్తామని చెప్పారు. అందరూ చివరకు వెళ్లేది శ్మశానానికేనని, వాటిని అభివృద్ధి చేస్తుండటం సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ శ్మశానవాటికల్లో ఉండేది దెయ్యాలు, భూతాలు కాదని... దేవుళ్లు ఉంటారని చెప్పారు. శ్మశానాలంటే దెయ్యాలు, భూతాలు అనే భావనను ప్రజల్లో నుంచి తొలగించి, వాటిని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.