brahmani: బ్రాహ్మణికి 9 కోట్లకు పైగా జీతం వస్తోంది.. ఎందుకు బయటపెట్టరు?: భూమన

  • జగన్ ను ఎదుర్కోలేకే చంద్రబాబు కుట్రలు
  • భారతిని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు
  • చంద్రబాబు అవినీతిపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకమే రాశారు

వైసీపీ అధినేత జగన్ కు వస్తున్న ప్రజాదరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారని, జగన్ ను ఎదుర్కోలేక కుట్రలకు పాల్పడుతున్నారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గతంలో సోనియాగాంధీతో చేతులు కలిపి జగన్ పై తప్పుడు కేసులు పెట్టించారని... ఇప్పుడు జగన్ పరపతిని దెబ్బతీసేందుకు ఆయన భార్య భారతిని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఇద్దరు ఈడీ అధికారులు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు సమర్పించాల్సిన పత్రాలను కూడా ముందుగానే చంద్రబాబుకు ఇచ్చారని అన్నారు.

హెరిటేజ్ సంస్థలో బ్రాహ్మణికి రూ. 9 కోట్లకు పైగా జీతం వస్తుందనే విషయాన్ని చంద్రబాబు ఎందుకు బయటపెట్టడం లేదని భూమన ప్రశ్నించారు. హెరిటేజ్ ఆదాయ వ్యవహారాలపై చంద్రబాబు విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. హెరిటేజ్ అక్రమాలు, లోకేష్ అవినీతిపై భవిష్యత్తు ప్రభుత్వాలు విచారణ చేస్తాయని అన్నారు. చంద్రబాబు అవినీతి గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ పుస్తకమే రాశారని చెప్పారు.

brahmani
lokesh
Chandrababu
bhumana
jagan
ys bharathi
  • Loading...

More Telugu News