YSRCP: జగన్ కారణంగానే భారతి ఈడీ కేసులో చిక్కుకున్నారు!: టీడీపీ నేతల ఆరోపణ

  • భారతి జగన్ అవినీతిలో భాగస్వామి
  • ఈడీ కేసులకు చంద్రబాబు కారణమని చెప్పడం దారుణం
  • ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే నేత జగన్ మాత్రమేనని ఎద్దేవా

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కారణంగానే ఆయన భార్య భారతి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో ఇరుక్కున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. సీబీఐ కేసులున్న సంస్థల్లో భారతి డైరెక్టర్ గా తప్పుకుందని జగన్ చెప్పారనీ, కానీ విచారణలో అది అబద్ధమని తేలడంతో ఈడీ ఆమె పేరును చార్జ్ షీట్ లో చేర్చిందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈడీ అధికారుల వెనుక సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని జగన్ చెప్పడం దారుణమని చినరాజప్ప అన్నారు.

మరోవైపు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరులో స్పందిస్తూ.. చంద్ర బాబుపై తునిలో వాడిన భాషను సరిచేసుకోవాలని జగన్ కు హితవు పలికారు. జగన్ అవినీతిలో భాగస్వామి కాబట్టే భారతి పేరును ఈడీ చార్జ్ షీట్ లోచేర్చిందని వ్యాఖ్యానించారు. ఏపీపై మోదీ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. దేశంలో ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరిగే ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. తుని రైలు దహనం ఘటనను చంద్రబాబే చేయించారని జగన్ చెప్పడం విడ్డూరమని చినరాజప్ప అన్నారు.

  • Loading...

More Telugu News