komatireddy: కోమటిరెడ్డిలాంటి బ్రోకర్లను, జోకర్లను టీఆర్ఎస్ లో చేర్చుకోము: జగదీష్ రెడ్డి

  • రాహుల్ పర్యటనతో టీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదు
  • కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోవడం లేదు
  • కోమటిరెడ్డి సోదరులు మతిస్థిమితం కోల్పోయారు

తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా, వందలాది మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అంటూ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనతో టీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు. రాహుల్ పర్యటనకు ప్రజలు కూడా రావడం లేదని, ఆ పార్టీని పట్టించుకోవడాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడో మానేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా ఉన్నారని చెప్పారు.

కోమటిరెడ్డిలాంటి బ్రోకర్లను, జోకర్లను టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడానికి తాము సిద్ధంగాలేమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూటకో మాట మాట్లాడే కోమటిరెడ్డి బ్రదర్స్ తమ పార్టీకి అవసరం లేదని అన్నారు. కోమటిరెడ్డి సోదరులు మతిస్థిమితం కోల్పోయారని, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తే మంచిదని దెప్పిపొడిచారు. 

komatireddy
jagadish reddy
Rahul Gandhi
kcr
  • Loading...

More Telugu News