roja: రోజా ఓ శూర్పణఖ.. పవన్ అంటే గాలి.. గాలి మాటలను ఎవరూ నమ్మరు!: జవహర్

  • రోజా ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీకి కష్టాలే
  • జగన్ భార్యపై కేసులకు, చంద్రబాబుకు ఏమిటి సంబంధం?
  • పవన్ కంటే నేనే గొప్ప నాయకుడిని

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా శూర్పణఖ పాత్రను పోషిస్తోందని మంత్రి జవహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీకి కష్టాలు తప్పవని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ భార్య భారతిపై ఈడీ కేసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమన్న రోజా వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈడీ కేసులకు, చంద్రబాబుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో జనసేన అధిత పవన్ కల్యాణ్ పై జవహర్ మండిపడ్డారు. పవన్ అంటే గాలి అని అర్థమని... గాలి మాటలను ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ను పట్టించుకునే తీరిక కూడా తమకు లేదని... పవన్ కంటే తానే గొప్ప నాయకుడినని అన్నారు. 

roja
jagan
ys bharathi
jawahar
Chandrababu
  • Loading...

More Telugu News