keerthi suresh: 'మహానటి'కి దక్కిన మరో పురస్కారం!

- భారీ విజయాన్ని సాధించిన 'మహానటి'
- కీర్తి సురేశ్ కి ప్రముఖుల ప్రశంసలు
- తమిళంలో వరుస సినిమాలు
తెలుగు.. తమిళ భాషల్లో సావిత్రికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వున్నాయి. ఆమె బయోపిక్ ను 'మహానటి' పేరుతో నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్ ఎంతోమంది ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా కీర్తి సురేశ్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది.
