Sonakshi Sinha: నా బరువు గురించి మీ కెందుకు?: సోనాక్షి సిన్హా సీరియస్

  • ఒకరితో పోల్చడం హీనమని వ్యాఖ్య
  • కామెంట్లను పట్టించుకోనని స్పష్టీకరణ
  • టాలెంట్ ను తక్కువ చేస్తున్నారని ఆగ్రహం

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సోషల్ మీడియాలో కొందరు ఆమె శరీరాకృతిని ఎగతాళి చేస్తూ కామెంట్లు పెట్టారు. దీనిపై సోనాక్షి సిన్హా తీవ్రంగా స్పందించింది.

‘చాలామంది నా లుక్ గురించి వేరొకరితో పోల్చి కామెంట్లు చేస్తున్నారు. చిన్నప్పుడు నేను లావుగా ఉండేదానిని. అయితే ఆ బరువు చూసుకుని ఎప్పుడూ నేను ఇబ్బంది పడలేదు. కానీ కొంతమంది మాత్రం నా బరువు లెక్కేస్తుంటారు? నేను ఎన్ని కేజీలు తగ్గాలి? అనే విషయంలో నాకు సలహాలు కూడా ఇచ్చేస్తుంటారు. టాలెంట్ ను తక్కువ చేసి బరువు, లుక్ అనే విషయాలు పట్టుకుని వేలాడటం చాలా చీప్’ అని సోనాక్షి మండిపడింది.

తనకేది మంచిదో అదే చేస్తాననీ, ఇతరుల కామెంట్లతో ఒత్తిడి పెంచుకోనని ఆమె స్పష్టం చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన లింగా సినిమాతో పాటు దబాంగ్, హాలీడే, రౌడీ రాథోడ్ వంటి బ్లాక్ బస్టర్ హిందీ సినిమాల్లో సోనాక్షి నటించింది.

Sonakshi Sinha
Bollywood
bodyshaming
angry
  • Loading...

More Telugu News