Sridevi: నేడు శ్రీదేవి జయంతి.. కన్నీటి పర్యంతమైన బోనీ కపూర్!

  • ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో మృతి చెందిన శ్రీదేవి
  • జయంతి సందర్భంగా 18 అడుగుల పెయింటింగ్‌ను రూపొందిస్తున్న బాలీవుడ్ ఆర్టిస్టులు
  • శ్రీదేవికి ఎప్పటికీ మరణం లేదన్న బోనీ కపూర్

ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ లెజెండ్ హీరోయిన్ శ్రీదేవి ఆకస్మికంగా మరణించింది. ఆమె మరణవార్త విని దేశం షాక్‌కు గురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి ప్రాణాలు విడిచింది.

నేడు శ్రీదేవి జయంతి. ఈ సందర్భంగా ఆమె భర్త బోనీకపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చిత్రపరిశ్రమలో హీరోలు, దిగ్గజాలు అని ఇద్దరు ఉంటారని పేర్కొన్నాడు. హీరోలను గుర్తు చేసుకుంటారని, కానీ దిగ్గజాలకు మరణం ఉండదని అన్నాడు. శ్రీదేవి ప్రతీ రోజూ తమతోనే ఉంటుందని పేర్కొన్నాడు. ఒక్క క్షణం కూడా తాము ఆమెను మర్చిపోవడం లేదన్నారు.

శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని బాంద్రాలోని చాపెల్ రోడ్డులో ఉన్న బిల్డింగ్‌లో బాలీవుడ్ ఆర్ట్ ప్రాజెక్టు 18 అడుగుల పొడవైన శ్రీదేవి కుడ్య చిత్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో రంజిత్ దహియా, కునాల్ దహియా, బిదిషా విశ్వాస్, అరుషు, రిచా వంటి ఆర్టిస్టులు ఉన్నారు. శ్రీదేవి నటించిన గురుదేవ్ సినిమాలోంచి ఆమె లుక్‌ను తీసుకుని తీర్చిదిద్దుతున్నారు. విషయం తెలిసిన బోనీ కపూర్ తన కుమార్తెలు జాన్వి, ఖుషీలతో కలిసి ధన్యవాదాలు తెలిపాడు. 

Sridevi
Bollywood
Boney kapoor
Janhvi Kapoor
Khushi Kapoor
Birth Anniversary
  • Loading...

More Telugu News