Sania Mirza: మీ బిడ్డను ఏ దేశం తరపున ఆడిస్తారన్న ప్రశ్నకు సానియా చెప్పిన సమాధానం ఇది!

  • నా బిడ్డను అసలు క్రీడల్లోకే రానివ్వను
  • గొప్ప డాక్టర్‌ను చేయాలనేదే నా కోరిక
  • జాతీయత సమస్య వస్తే మూడో దేశాన్ని ఎంచుకుంటా

భవిష్యత్తులో మీ బిడ్డను ఏ దేశం తరపున ఆడిస్తారు? అన్న ప్రశ్నకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించిన సానియా.. తన బిడ్డను స్పోర్ట్‌స్టార్‌గా చూడాలనుకోవడం లేదని సమాధానం ఇచ్చింది.

‘భవిష్యత్తులో మీ బిడ్డను ఏ క్రీడలో చూడాలనుకుంటున్నారు? ఏ దేశం తరపున ఆడిస్తారు?' అన్న ప్రశ్నకు సానియా మాట్లాడుతూ తనకా ఉద్దేశమే లేదని తేల్చి చెప్పింది. తన బిడ్డను గొప్ప డాక్టర్‌గా చూడాలనుకుంటున్నట్టు పేర్కొంది. తన బిడ్డ జాతీయత గురించి ఆలోచించడం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అదే సమస్య తలెత్తితే భారత్, పాక్ కాకుండా మూడో దేశాన్ని ఎంచుకుంటానని పేర్కొంది. తమకు ఎవరు పుట్టినా ఓకే అని, అయితే షోయబ్ మాత్రం అమ్మాయినే కోరుకుంటున్నాడని సానియా వివరించింది. 

Sania Mirza
Shoib Malik
Tennis
Cricket
Doctor
Pakistan
India
  • Loading...

More Telugu News