sv medical college: తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్య

  • ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక
  • కళాశాల హాస్టల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య
  • కడప జిల్లాకు చెందిన గీతిక

డాక్టరు శిల్ప ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి రాకముందే తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని గీతిక ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల హాస్టల్ లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గీతిక కడప జిల్లాకు చెందిన వ్యక్తి అని సమాచారం. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

sv medical college
gitika
suicide
  • Loading...

More Telugu News