sanjay dutt: తుపాకులు, డ్రగ్స్, అమ్మాయిలు అన్నీ చూపించాం.. ఇక సమస్యేంటి?: మీడియాపై సంజు డైరెక్టర్ అసహనం

  • సంజయ్ జీవితంలో చెడును దాచలేదని వెల్లడి
  • ఓ మీడియా రాసిన స్టోరీని మాత్రమే విమర్శించామని స్పష్టీకరణ
  • ఐఎఫ్ఎఫ్ఎం వేడుకలో పాల్గొన్న హిరాణి

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సంజు సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా హిట్టయినప్పటికీ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణికి తలనొప్పులు మాత్రం తప్పడం లేదు. జీవితంలో ఎన్నో నెగటివ్ షేడ్స్ ఉన్న సంజయ్ ను మంచివాడిగా చూపించేందుకు యత్నించారంటూ హిరాణిపై విమర్ళలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై హిరాణి స్పందించాడు.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎం) లో పాల్గొనేందుకు వచ్చిన హిరాణీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ విషయంలో నేను మాట్లాడటం మొదలుపెడితే.. రోజంతా మాట్లాడుతూనే ఉంటాను. సంజయ్ ఇంట్లో ఆర్డీఎక్స్ దొరికిందని ఈ రోజు ప్రజలు నమ్ముతున్నారంటే ఓ పత్రిక రాసిన తప్పుడు కథనమే కారణం. మేం ఆ తప్పుడు స్టోరీని మాత్రమే సినిమాలో విమర్శించాం. కానీ ఇప్పుడు కొందరు సంజు సినిమాలో నేను మీడియాను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. సంజయ్ దగ్గర తుపాకీ ఉంది. దాన్ని సినిమాలో చూపించాం. అమ్మాయిలతో అతని అఫైర్లు, డ్రగ్స్ అలవాట్లు అన్నింటిని సంజులో పెట్టాం. దీంట్లో సంజయ్ ను మంచివాడిగా, సచ్ఛీలుడిగా చూపించడం ఏముంది?’ అంటూ ప్రశ్నించాడు.

sanjay dutt
rajkumar hirani
sanju movie
Bollywood
  • Loading...

More Telugu News