nasa: ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ను ప్రయోగించిన నాసా
- కేప్ కెనెవెరాల్ నుంచి ప్రయోగించిన నాసా
- డెల్టా 4 భారీ రాకెట్ ద్వారా నింగిలోకి
- 150 కోట్ల డాలర్లతో ప్రత్యేకంగా రూపొందిన వ్యోమనౌక
సూర్యుడి గురించిన ఎన్నో రహస్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ రోబోటిక్ వ్యోమనౌకను అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఈరోజు ప్రయోగించింది. కేప్ కెనెవెరాల్ నుంచి డెల్టా 4 భారీ రాకెట్ ద్వారా పార్కర్ ప్రోబ్ వ్యోమనౌకను నింగిలోకి పంపింది.
ఈ సందర్భంగా నాసా ఉన్నతాధికారి థామస్ జుర్బెచన్ మాట్లాడుతూ,150 కోట్ల డాలర్ల తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ వ్యోమనౌక విషయంలో ఇంజనీర్లు చాలా జాగ్రత్త వహిస్తున్నారని అన్నారు. వ్యూహాత్మకంగా చూస్తే ఈ వ్యోమనౌక తమకు ఎంతో ముఖ్యమైందని అన్నారు. కాగా, ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ ప్రయోగం వాస్తవానికి శనివారం తెల్లవారుజామున 3.53 గంటలకు జరగాల్సి ఉంది. కానీ, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ ప్రయోగాన్ని ఈ రోజుకు నాసా వాయిదా వేసింది.