Jammu And Kashmir: శ్రీనగర్ లో ఎన్ కౌంటర్... ఎస్ఓజీ పోలీస్ మృతి!

  • ఈ ఉదయం ఎన్ కౌంటర్
  • కాల్పుల్లో ఎస్ఓజీ పోలీస్ మృతి
  • ఇద్దరు జవాన్లకు గాయాలు

జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌, బట్మాలూ సమీపంలో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ లో ఓ పోలీసు వీరమరణం పొందగా, మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) పోలీస్ మరణించాడని, ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని డీజీపీ శేషు పాల్ వైద్ తెలిపారు.

 ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు, జవాన్లు, ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించిన సమయంలో, ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని ఆయన అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఉగ్రవాదులు దాడులకు దిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.

Jammu And Kashmir
Encounter
SOG Officer Died
SP Vaid
  • Loading...

More Telugu News