Tamilnadu: తన తండ్రి శాకాహారిగా మారిన కారణాన్ని చెప్పిన కనిమోళి!

  • పెంపుడు కుక్క మరణంతో మారిన కరుణానిధి
  • ఇంటి వెనుకే కుక్క మృతదేహం ఖననం
  • ఆపై ఎన్నడూ మాంసాహారం ముట్టని కరుణ

ఒకప్పుడు మాంసాహారి అయిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి, శాకాహారిగా ఎందుకు మారారన్న విషయాన్ని ఆయన కుమార్తె కనిమోళి గుర్తు చేసుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, ఒకే ఒక్క ఘటన ఆయన్ను మాంసాహారానికి దూరం చేసిందని చెప్పారు.

 ఆయన తన ఇంట్లో ఓ నల్లటి కుక్కను పెంచుకునేవారని, ఇంట్లో ఉన్నంతసేపూ అది వెన్నంటే ఉండేదని చెప్పిన కనిమోళి, తాను ఏది తింటే, దాన్నే కుక్కకు కూడా పెట్టేవారని చెప్పారు. ఆ కుక్కంటే తన తండ్రికి ఎంతో ఇష్టమని, అది మరణించిన తరువాత, మాంసాహారాన్ని మానేశారని చెప్పారు. కుక్క మృతదేహాన్ని తమ ఇంటి వెనకున్న ఖాళీ స్థలంలోనే ఖననం చేసి, అక్కడ ఓ మొక్కను ఆయన నాటారని, ఇప్పుడది పెద్ద చెట్టుగా ఎదిగిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు కనిమోళి.

Tamilnadu
Karunanidhi
Kanimozhi
  • Loading...

More Telugu News