Guntur District: అమరావతి సమీపంలో భారీ అగ్నిప్రమాదం!

  • పెదకాకానిలో తగలబడ్డ పత్తి గోడౌన్
  • షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు
  • గుంటూరు, విజయవాడల నుంచి వచ్చిన ఫైరింజన్లు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలోని పెదకాకానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వాసవీనగర్ లో ఉన్న పత్తి గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ గోడౌన్ లో పలువురు వ్యాపారులు వేలాది పత్తి బేళ్లను దాచుకున్నారు. ఈ తెల్లవారుజామున మంటలు చెలరేగగా, ఇప్పటివరకూ కోట్ల రూపాయల విలువైన పత్తి దగ్ధమైంది.

గుంటూరు నుంచి ఆరు ఫైర్ ఇంజన్లు వచ్చినా మంటలు అదుపులోకి రాకపోవడంతో, విజయవాడ నుంచి కూడా అగ్నిమాపక సిబ్బందిని, శకటాలను రప్పించారు. మొత్తం 11 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Guntur District
Pedakakani
Fire Accident
Amaravati
Cotton Godown
  • Loading...

More Telugu News