Indian Railways: ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ... ప్రమాద బీమా కావాలంటే అదనంగా కట్టాల్సిందే!
- సెప్టెంబర్ 1 నుంచి బీమా సదుపాయం రద్దు
- నిర్దేశిత మొత్తం చెల్లిస్తేనే బీమా
- స్పష్టం చేసిన ఐఆర్సీటీసీ
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే షాకిచ్చింది. వచ్చే నెల నుంచి ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్టు అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ సదుపాయం లభించదని ఐఆర్సీటీసీ (భారతీయ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్) అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఏదైనా ప్రమాదం జరిగితే బీమా కావాలని భావించే వారు ఇకపై నిర్దేశిత సొమ్మును చెల్లించాల్సి వుంటుందని, ఆ మొత్తం ఎంతన్న విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని ఆయన అన్నారు. కాగా, రైలు ప్రయాణికులను డిజిటల్ కార్యకలాపాల వైపు మళ్లించేందుకు 2017లో ఉచిత బీమా సౌకర్యాన్ని ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బీమా కింద రైలు ప్రయాణంలో వ్యక్తి మరణిస్తే, రూ. 10 లక్షల బీమా పరిహారం అందుతుంది.