Rahul Gandhi: ఓయూలో రాహుల్ సభకు ఎందుకు అనుమతివ్వలేదో చెప్పాలి?: జానారెడ్డి

  • తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీనే
  • ఈ విషయం మర్చిపోకూడదు
  • టీఆర్ఎస్ ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతోంది

ఈ నెల 13, 14 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ)లో రాహుల్ గాంధీ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే, అందుకు అనుమతి లభించకపోవడంపై టీ-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. ఓయూలో రాహుల్ సభకు ఎందుకు అనుమతివ్వలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీనే అన్న విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోకూడదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. 

Rahul Gandhi
Jana Reddy
kcr
  • Loading...

More Telugu News