modi: మోదీ వద్ద కేసీఆర్ మోకరిల్లలేదు.. బాబు ముందు ‘కాంగ్రెస్’ మోకరిల్లింది: ఎంపీ బాల్క సుమన్

  • కాంగ్రెస్ పార్టీ మాపై బురదజల్లడం తగదు
  • పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం
  • ఓయూలో రాజకీయపార్టీల సభలకు అనుమతి లేదు

టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తమపై బురదజల్లడం తగదని, ప్రధాని మోదీ వద్ద కేసీఆర్ మోకరిల్లలేదని, బాబు ముందు ‘కాంగ్రెస్’ మాత్రం మోకరిల్లిందని అన్నారు.

టీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే సంబంధం మాత్రమే ‘తెలంగాణ’కు ఉందని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభకు ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ)లో అనుమతి లభించకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ఓయూలో రాజకీయపార్టీల సభలకు అనుమతి లేదని, రాహుల్ సభకు అనుమతి రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు సబబు కాదని అన్నారు.

modi
Chandrababu
balka suman
  • Loading...

More Telugu News