Telugudesam: పీడీ ఖాతాలపై బహిరంగ చర్చకు జీవీఎల్ సిద్ధమా?: ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ సవాల్

  • అసత్య ఆరోపణలు చేయొద్దు
  • జీవీఎల్ రాష్ట్రానికి చేసిన మేలేంటో చెప్పాలి?
  • పీడీ ఖాతాల లెక్కలు చూపమని కేంద్రాన్ని అడగగలరా?

ఏపీ రాష్ట్ర పీడీ అకౌంట్స్ లో భారీ స్కామ్ జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలపై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ స్పందించారు. పీడీ ఖాతాలపై బహిరంగ చర్చకు జీవీఎల్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. జీవీఎల్ ఒక ఎంపీగా రాష్ట్రానికి చేసిన మేలేంటో చెప్పాలి? కేంద్రాన్ని పీడీ ఖాతాల లెక్కలు చూపించమని అడిగే ధైర్యం జీవీఎల్ కు ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు రాకుండా చేసేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అవినీతి జరిగిందని కాగ్ నివేదికలో ఎక్కడా చెప్పలేదని అన్నారు.

Telugudesam
mlc
janardhan
gvl
bjp
  • Loading...

More Telugu News