jyothika: తమిళంలో హిట్ కొట్టేసింది .. తెలుగులో 'ఝాన్సీ'గా వచ్చేస్తోంది

- తమిళంలో 'నాచ్చియార్'
- తెలుగులో 'ఝాన్సీ'
- ఈ నెల 17న విడుదల
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా జ్యోతికకి ఎంతో క్రేజ్ వుంది. సూర్యతో వివాహం తరువాత సినిమాలను దూరం పెట్టిన ఆమె, ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చింది. తన వయసుకి తగిన ప్రధానమైన పాత్రలను చేస్తూ, విజయాలను అందుకుంటోంది. ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో ఆమె చేసిన 'నాచ్చియార్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
