pawan kalyan: జనసేనలో చేరిన హరిరామజోగయ్య కుమారుడు

  • జోగయ్య నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్
  • సమకాలీన రాజకీయాలపై గంటసేపు చర్చ
  • జనసేనలో చేరిన జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్

సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు జనసేనలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో నిన్న సాయంత్రం పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభ అనంతరం భీమవరంకు తిరుగుపయనమయ్యారు.

మార్గమధ్యంలో పాలకొల్లులో ఉన్న హరిరామజోగయ్య నివాసానికి ఆయన వెళ్లారు. అక్కడ ఆయనతో దాదాపు గంటసేపు సమకాలీన రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్న పవన్ కల్యాణ్ ను జోగయ్య మెచ్చుకున్నారు. ఆయన రాసిన '60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకాన్ని బహూకరించారు. ఇదే సమయంలో జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ జనసేన పార్టీలో చేరారు. 

pawan kalyan
harirama jogaiah
son
janasena
  • Loading...

More Telugu News