Ayyanna Patrudu: తల్లి, చెల్లి, భార్యను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసింది జగన్ కాదా?: మంత్రి అయ్యన్న

  • విశాఖలో విజయమ్మ ఓటమికి జగనే కారణం
  • షర్మిల కనిపించకుండా పోవడానికి కారణం ఆయనే
  • భారతిపై కేసు నమోదు కావడానికి కూడా ఆయనే కారణం

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సొంత కుటుంబంలోని ఆడవాళ్లను రోడ్డు పైకి లాగిన జగన్... దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఆరోపించడం తగదని అన్నారు. తల్లి, చెల్లి, భార్యను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో విజయమ్మ ఓడిపోవడానికి జగనే కారణమని అన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు షర్మిల పాదయాత్ర చేశారని... ఇప్పడు ఆమె కనిపించకుండా పోవడానికి కూడా జగనే కారణమని తెలిపారు. భారతిపై ఈడీ కేసు నమోదు కావడానికి కూడా జగనే కారణమని చెప్పారు. 

Ayyanna Patrudu
jagan
Chandrababu
vijayamma
sharmila
bharathi
  • Loading...

More Telugu News